ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనపోరాటం - ప్రియురాలు మౌనపోరాటం

ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడి... ఉద్యోగం రాగానే పెళ్లికి నిరాకరిస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుని కోసం ప్రియురాలు.. అతను పని చేస్తున్న అటవీశాఖ రేంజ్ కార్యాలయం ముందు మౌన పోరాటానికి దిగింది.

cheating-lady
cheating-lady

By

Published : Aug 25, 2020, 11:31 PM IST

తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేటలోని అటవీశాఖ రేంజ్ కార్యాలయం ముందు మమత అనే యువతి మౌనపోరాటానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన భూక్యా రవి, మమతలు గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా సదరు రవికి బీట్ ఆఫీసర్ ఉద్యోగం రావడం వల్ల మమతతో పెళ్లికి నిరాకరించాడు.

దీంతో మమత తన ప్రియుడు పని చేస్తున్న అటవీశాఖ కార్యాలయం ముందు మౌనపోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకుంది.

ఇవీ చూడండి: వైద్యం వదిలేసి మాంత్రికుడిని నమ్మాడు.. అంతలోనే..

ABOUT THE AUTHOR

...view details