ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పోలీసుల పేరుతో మోసాలు.. పట్టుకున్న ఖాకీలు - giddaluru news

అతను వార్తా పత్రికలు చదువుతాడు. న్యూస్ వెబ్​సైట్లు చూస్తాడు. నాలెడ్జ్ పెంచుకోవడానికో, సమాచారం తెలుసుకోవడానికో కాదు. నేరాలు చేయడానికి.! షాకింగ్​గా ఉంది కదూ.. ఇది నిజం. ఫోన్ కాల్సే అతగాడి పెట్టుబడి. ఓ సారి డీఎస్పీ అంటాడు.. మరోసారి పోలీస్ నంటూ ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఇలా రకరకాల పేర్లుతో బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ఘరానా మోసగాడ్ని ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు పట్టుకున్నారు.

Cheater Arrested in giddaluru
ఘరానా మోసగాడు

By

Published : Jun 8, 2020, 7:45 PM IST

ఘరానా మోసగాడు అరెస్ట్

పోలీసు అధికారినంటూ ఒక సారి, పోలీసులు నాకు తెలుసు కేసులు లేకుండా చేస్తానంటూ మరోసారి... ఇలా రకరకాలుగా మోసాలకు పాల్పుడుతున్న ఓ వ్యక్తిని గిద్దలూరు పోలీసులు అరెస్టు చేసారు. అనంతపురం జిల్లా వెలమద్ది గ్రామానికి చెందిన రాచంపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి గతంలో చైన్‌ స్నేచింగ్‌ వంటి చిల్లర దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభించాడు.

జైల్లో పలువురు నేరస్తులతో పరిచయాలు పెంచుకుని.. ఇలాంటి చిల్లర దొంగతనాలు ఎన్నాళ్ళు చేస్తామని చెప్పి.. కొత్తగా ఏమైనా మోసాలు చేసి, పెద్ద మొత్తంలో సొమ్ము సంపాదించాలని భావించాడు. వార్తా పత్రికలు, న్యూస్‌ వెబ్​సైట్​ను అనుసరించి నేర వార్తలు గమనించి వాటి ఆధారంగా మోసాలు చేయడం ప్రారంభించాడు.

డీఎస్పీగా నమ్మించి..నట్టేట ముంచాడు..

గిద్దలూరు వద్ద ఎన్నికల సమయంలో 30 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఈ వార్తను చూసిన శ్రీనివాసులు.. స్టేషన్‌కు ఫోన్‌ చేసి, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా చెప్పి ఆ డబ్బు వివరాలు రాబట్టాడు. తరువాత డబ్బు గల వ్యక్తికి ఫోన్‌ చేసి... తాను పోలీసు అధికారినని, తనకు కొంత లంచం ఇస్తే డబ్బును తిరిగి ఇప్పిస్తానంటూ ఫోన్‌ చేసి దాదాపు 2.4 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అదే విధంగా శిక్ష అనుభవిస్తున్న సమయంలో జైలర్‌ ప్రవర్తనను దగ్గరుండి గమనించి... అతడి లోపాలన్నీ గుర్తుపెట్టుకొన్నాడు. తరువాత జైళ్ళ శాఖ ఉన్నతాధికారిగా ఆ జైలర్‌కు ఫోన్‌ చేసి నీ ఉద్యోగం పోతుందంటూ బెదరించసాగాడు. దీంతో ఆయన భయపడటంతో ... కొంత నగదు పట్టుకొని వస్తే కాపాడతానని చెప్పి... అతని వద్ద నుంచి కొంత పైకం నొక్కేశాడు.

తెలివిగా డబ్బు తీసుకునేవాడు..

అనకాపల్లిలో ఓ ప్రధాన ఉపాధ్యాయుడి విషయంలోనూ రేప్‌ కేసు కాకుండా చూస్తానని సొమ్ము వసూలు చేసాడు. డబ్బు తనకు నేరుగా గానీ, తన ఖాతాకు గానీ జమ కాకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఏదో ఒక కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్ళి తన బంధువులకు ఆరోగ్యం బాగులేదని, వైద్య ఖర్చులు నిమిత్తం తనవాళ్ళు డబ్బులు పంపిస్తున్నారని... తనకు ఎకౌంట్‌ లేదని, మీ ఎకౌంట్‌ నెంబర్‌ ఇస్తే అందులో డబ్బులు పడతాయని, ఆ సొమ్ము తనకు చెల్లించండని ప్రాధేయపడేవాడు. నిజమని నమ్మి లంచంగా వచ్చే డబ్బును వేరే వారి ఖాతాలో వేయించుకొని తెలివిగా తాను సొమ్ము చేసుకునేవాడు. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు.... కర్ణాటక రాష్ట్రంలో కూడా పలు మోసాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ప్రకాశం జిల్లా గిద్దలూరులో పోలీసులకు చిక్కడంతో అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

లైవ్ వీడియో: కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి మృతి

ABOUT THE AUTHOR

...view details