ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగిన ఘటన తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో వెలుగు చూసింది. అన్ని తానై చూసుకుంటానని నమ్మపలికిన సంతోష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో 10 ఏండ్లు కలిసి సహజీవనం చేశాడు. పెళ్లి పేరెత్తగానే మొహం చాటేశాడు. దీంతో దిక్కు తోచని ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటిముందు బైఠాయించి న్యాయపోరాటానికి దిగింది. సంతోష్ తో పెళ్లి చేయకపోతే చనిపోతానని... క్రిమి సంహారక మందుతో బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతం అయ్యింది ఆ అభాగ్యురాలు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా... పెళ్లి జరిపించే వరకు కదిలేది లేదని విలపించింది.
పదేండ్లు సహజీవనం చేశాడు..పెళ్లి పేరెత్తగానే... - women cheated by lover in warangal district
అన్ని తానై చూసుకుంటానని నమ్మపలికాడు. నీవు లేక నేను లేనని అన్నాడు. నిన్ను బంగారంలా చూసుకుంటానని ముద్దు ముద్దు ముచ్చట్లు చెప్పాడు. నీతోనే చావైనా బతుకైనా అని సినిమా డైలాగులు సైతం చెప్పి ఓ అభాగ్యురాలిని సంతోష్ అనే యువకుడు వలలో వేసుకున్నాడు. 10 ఏండ్లు కలిసి సహజీవనం చేసి పెళ్లి పేరెత్తగానే మొహం చాటేశాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో చోటుచేసుకుంది.

woman stage protest