ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

వేధిస్తున్నాడంటూ సొంత పార్టీ నేతపై మహిళ ఫిర్యాదు

తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడిపై సొంత పార్టీ నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా రోజులుగా లైంగికగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

sexual allegations
sexual allegations

By

Published : Nov 27, 2020, 6:50 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడిపై లైంగిక ఆరోపణలు రావటం చర్చనీయాంశమయ్యాయి. అదే పార్టీ చెందిన ఓ మహిళా నాయకురాలు...తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు గురి చేశాడని తెలిపింది. స్థానిక దళిత నాయకులతో కలిసి మాట్లాడిన బాధితురాలు... సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆరోపణలు అవాస్తం...

సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను సదరు నేత ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు. రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా తనపై కుట్ర చేశారని చెప్పారు. రాజకీయాల్లో 30 ఏళ్లుగా ఉన్న తనపై ఇలాంటి ఆరోపణలు రాలేదని అన్నారు. విచారణ జరిగితే అన్ని విషయాలు బయటికొస్తాయని చెప్పారు.

ఇదీ చదవండి

మంగళూరులో కలకలం- ఉగ్రవాదులకు మద్దతుగా గ్రాఫిటీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details