హైదరాబాద్ చందానగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు బ్యాంకు సమీపంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏటీఎం పనిచేయకపోవడం వల్ల వారు చోరీ చేసేందుకు వీలు కలిగినట్లు పేర్కొన్నారు.
ఎస్బీఐ ఏటీఎం చోరీ.. 15 లక్షలు అపహరణ
హైదరాబాద్ చందానగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు. సుమారు రూ. 15 లక్షల నగదు అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగలు బ్యాంకు సమీపంలో రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్లు భావిస్తున్నారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎస్బీఐ ఏటీఎం చోరీ.. 15 లక్షలు అపహరణ
దొంగలు గ్యాస్ సిలిండర్ తెచ్చి.. కట్టర్ల సహాయంతో ఏటీఎంను తొలగించి అందులో ఉన్న సుమారు రూ. 15 లక్షలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరసింహులు తెలిపారు.