ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

బుల్లెట్ మీద వస్తాడు... దృష్టి మరల్చి నగలు ఎత్తుకెళ్తాడు - చైన్ స్నాచర్​ అరెస్ట్ వార్తలు

మహిళల దృష్టి మరల్చి నగలు ఎత్తుకెళ్తున్న వ్యక్తిని తెలంగాణలోని రాజేంద్రనగర్​ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్​ ఆధారంగా నిందితుడిని గుర్తించి... అదుపులోకి తీసుకుని... అతని నుంచి రూ.6 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బుల్లెట్ మీద వస్తాడు... దృష్టి మరల్చి నగలు ఎత్తుకెళ్తాడు
బుల్లెట్ మీద వస్తాడు... దృష్టి మరల్చి నగలు ఎత్తుకెళ్తాడు

By

Published : Oct 7, 2020, 8:31 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 6 లక్షల విలువ చేసే 11 తులాల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

దూల్‌పేటకు చెందిన సంజయ్ సింగ్... వృద్ధుల, ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని... వారి దృష్టి మరల్చి నగలను కాజేసేవాడని ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తించి అరెస్టు చేశామని వెల్లడించారు.

బుల్లెట్ మీద వస్తాడు... దృష్టి మరల్చి నగలు ఎత్తుకెళ్తాడు

ABOUT THE AUTHOR

...view details