ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

శాంతిలాల్ అండ్ సన్స్ జ్యూవెలర్స్​పై సీబీఐ కేసు నమోదు - cbi registered case on shanthilal latest news

నెల్లూరు పట్టణంలోని శాంతిలాల్ అండ్ సన్స్ జ్యూవెలర్స్ యాజమాన్యం, నిర్వాహకులపై సీబీఐ చెన్నై విభాగం కేసు నమోదు చేసింది. సిండికేట్ బ్యాంకును, కెనరా బ్యాంకు మోసగించారనే అభియోగంపై కేసు నమోదైంది.

శాంతిలాల్ అండ్ సన్స్ జ్యూవెలర్స్​పై సీబీఐ కేసు నమోదు
శాంతిలాల్ అండ్ సన్స్ జ్యూవెలర్స్​పై సీబీఐ కేసు నమోదు

By

Published : Sep 24, 2020, 9:50 PM IST

నెల్లూరు పట్టణ కేంద్రంలోని శాంతిలాల్ అండ్ సన్స్ జ్యూవెలర్స్ దర్గామిట్ట బ్రాంచ్​లో రూ.70.13 కోట్ల రుణం తీసుకుంది. ఈ నేపథ్యంలో హామీగా ఉంచిన సొమ్ములను (స్టాకు) బ్యాంక్ అధికారులకు తెలియకుండా మళ్లించినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది.

ఆధునికీకరణ ముసుగులో..

నగల దుకాణం ఆధునికీకరణ ముసుగులో తమకు హామీగా ఉంచిన సొమ్ములను అమ్మేసి, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కెనరా బ్యాంక్ ఏజీఎం సత్యనారాయణమూర్తి కేంద్ర దర్యాప్తు సంస్థలో ఫిర్యాదు చేశారు. ఫలితంగా సీబీఐ చెన్నై విభాగం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

శాంతిలాల్ అండ్ సన్స్ జ్యూవెలర్స్​పై సీబీఐ కేసు నమోదు

ఇవీ చూడండి : వివేకా హత్యకేసు: సెటిల్​మెంట్లు, స్థిరాస్తి గొడవలపై సీబీఐ ఆరా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details