మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు చెప్తున్నారు. శంషాబాద్‌కు చెందిన భార్యాభర్తలు అర్ధరాత్రి మద్యం సేవించి.. మాదాపూర్ ఐకియా అండర్‌పాస్ గుండా ప్రయాణిస్తున్నారు.
మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు పల్టీలు కొట్టిన కారు - మద్యంమత్తులో డ్రైవింగ్.. మూడు పల్టీలు కొట్టిన కారు
మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ బోల్తాపడి భార్యాభర్తలు స్వల్పగాయాలతో బయటపడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు పల్టీలు కొట్టిన కారు
అండర్‌పాస్ సమీపానికి రాగానే.. కారు ఒక్కసారిగా అదుపు తప్పి.. పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.