విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురంలో కారుకు దండుగులు నిప్పు పెట్టారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిద్రిస్తున్న వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా కారు దగ్దమైంది. గ్రామానికి చెందిన సూరిశెట్టి వెంకట గణేష్‌కు చెందిన కారును ప్రత్యర్ధులు తగలబెట్టారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో రెండు రోజుల కిందట పశువుల పాకను తగలబెట్టిన సంఘటన నుంచి తేరుకోక ముందే మరొక సంఘటన జరగడంపై చర్చ జరుగుతోంది. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ డి.లక్ష్మీ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భోగాపురంలో కారుకు నిప్పు పెట్టిన దుండగులు - fire accident news in bhogapuram vishaka
విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురంలో పశువులపాకను తగలబెట్టిన ఘటన జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే గ్రామానికి చెందిన సూరిశెట్టి వెంకట గణేష్‌కు చెందిన కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వరస ఘటనలతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
కారును దగ్ధం చేసిన దుండగులు