ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

హైదరాబాద్ ఓఆర్​ఆర్​పై ప్రమాదం.. ఇద్దరు మృతి - కోహెడ వద్ద ప్రమాదం

హైదరాబాద్​ ఔటర్​రింగ్​రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొనగా... 11 నెలల చిన్నారితో పాటు తల్లి కూడా మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

car-accident-
car-accident-

By

Published : Nov 22, 2020, 5:12 PM IST

హైదరాబాద్​లోని ఓఆర్​ఆర్​పై కోహెడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. ఔటర్​ రింగ్​ రోడ్డు​పై ముందు వెళ్తున్న వాహనాన్ని అతివేగంతో వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 నెలల కుమార్తెతో పాటు తల్లి మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను కర్ణాటకకు చెందిన త్రివేణి, చిన్నారి త్రివిక్షగా గుర్తించారు. బెంగుళూరుకు చెందిన నర్సింహ్మమూర్తి తన కూతురి తలనీలాలు సమర్పించాడానికి కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details