108 వాహనానికి నిప్పు పెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. మాజీ రౌడీ షీటర్ అయిన ఓ వ్యక్తి 108 కు పదే పదే రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు.
ఈ క్రమంలో సదరు వ్యక్తి ఠాణాలోని అద్దాలను ధ్వంసం చేయడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతని మానసిక పరిస్థితి బాగాలేదని గ్రహించిన పోలీసులు... స్థానిక వైద్యశాలకు తరలించేందుకు 108 వాహనాన్ని రప్పించారు.