తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి)లో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు.
సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన శశికళ, బావూజీ దంపతులకు నలుగురు సంతానం. చిన్న కుమారులైన దిలీప్, శ్రీకాంత్‌లు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే దిలీప్ గత ఏడాది ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడగా.. నడుం దెబ్బతింది. అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాడు. తమ్ముడు శ్రీకాంత్ అన్న దిలీప్‌కు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.