మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి(9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో దీక్షిత్‌ను దుండగులు అపహరించారు. ఇంటి వద్ద ఆడుకుంటుండగా దీక్షిత్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు.
తెలంగాణ: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య - Mahabubabad District Crime News
10:54 October 22
రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని విడిచిపెడతామంటూ ఫోన్‌లో కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.45 లక్షల్లో కొంత డబ్బు ఇచ్చేందుకు బాలుడి తల్లిదండ్రుల అంగీకరించారు. కిడ్నాపర్ చెప్పిన సమయానికి బాలుడి తల్లిదండ్రులు డబ్బు సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ చోట కిడ్నాపర్ల కోసం వేచిచూశారు. కిడ్నాపర్ నుంచి స్పందన రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. బాలుడి ఆచూకీ కోసం 100 మందితో కూడిన 10 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సంబంధిత కథనాలు...