ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పొలం దున్నుతుండగా.. ట్రాక్టర్ పైనుంచి పడి బాలుడి మృతి - ములుగు జిల్లాలో విషాదం

ఆటవిడుపు కోసం వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయ్యింది. పొలం దున్నుతుండగా ట్రాక్టర్​పై ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ కళ్ల ముందు తిరిగిన చిన్నారి విగత జీవిగా మారటంతో తల్లితండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు.

mulugu district telangana
mulugu district telangana

By

Published : Dec 16, 2020, 9:57 PM IST

ట్రాక్టర్ పైనుంచి పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా గుర్తూరు తండా గ్రామపంచాయతీ పరిధిలోని రైమ్ నగర్ తండాలో చోటు చేసుకుంది. గుగులోతు చిన్నలచ్చులు అనే వ్యక్తి తన పొలం దున్నేందుకు రాజేందర్ అనే బాలుడిని ట్రాక్టర్​లో తనతో పాటు తీసుకెళ్లాడు. పొలం దున్నుతుండగా ట్రాక్టర్​పై ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు జారి రోటవేటర్​లో పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఎవరికీ అనుమానం రాకుండా లచ్చులు పక్కనే ఉన్న నీరులేని బావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బావిలోంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి విగత జీవిగా మారగా తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details