కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈనెల 3న కుక్కల దాడిలో నరసింహ అనే బాలుడు మరణించగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడిపై ఒకేసారి ఎనిమిది కుక్కలు దాడి చేసిన దృశ్యాలు.. స్థానికంగా ఉండే ఆస్పత్రి ఆవరణలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
బాలుణ్ని వెంటాడి.. వేటాడిన దృశ్యాలు కలకలం రేపాయి. ఇలాంటి దారుణాలు జరుగుతున్నా... కుక్కల నిర్మూలనకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.