తెలంగాణలో ఓ కసాయి తండ్రి.. కన్న పిల్లలను కడతేర్చాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈ దారుణం జరిగింది. బొంబాయి కాలనీలో నివాసముండే శిరీష, కుమార్.. దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు. ఈ మధ్య భర్త తీరుతో విసిగిపోయిన శిరీష... కుటుంబాన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వదిలేసిందన్న ఆగ్రహంతో... కుమార్ కసాయిగా మారాడు. కన్న పిల్లలని కూడా చూడకుండా.. వారిపై తన ప్రతాపం తీర్చుకున్నాడు. ప్రతిరోజు నాయనమ్మ, మేనత్తల వద్ద పడుకునే పిల్లల్ని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. కుమారుడు అఖిల్‌ను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. చిన్న కుమార్తె శరణ్యకు వంట గదిలో ఉరి వేశాడు. పెద్ద కుమార్తె మల్లీశ్వరి గొంతు కోయడానికి ప్రయత్నించగా .. ఆమె తప్పించుకుని నాయనమ్మ వద్దకు చేరుకుంది.
భార్య వదిలేసి వెళ్లిందని.. పిల్లల్ని చంపేశాడు! - sangareddy
కుటుంబ కలహాలు ఆ పిల్లల ప్రాణాలు హరించాయి. ఆడుకునే వయసులో వారిని అనంతలోకాలకు చేర్చాయి. భార్య వదిలేసి వెళ్లిపోయిందనే కోపంలో.. పిల్లలిద్దర్ని హతమార్చాడు ఓ కసాయి తండ్రి.
father killed his two childern
ఈ ఘటనలో అఖిల్, శరణ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ పెద్ద కుమార్తె మల్లీశ్వరిని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పిల్లలను హత్య చేసిన కుమార్‌ను స్థానికులు పట్టుకొని చితకబాదారు. రామచంద్రాపురం పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: కరెంటు వాడకం పల్లెల్లో తగ్గింది నగరాల్లో పెరిగింది