ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భారతీయ డెంటిస్ట్​ హత్య - preethi

ఆస్ట్రేలియాలో విషాద ఘటన వెలుగుచూసింది. ఓ ఆసుపత్రిలో సర్జన్​గా పనిచేస్తున్న భారతీయ డెంటిస్ట్​ ప్రీతిరెడ్డి దారుణహత్యకు గురైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భావిస్తున్న ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు రోడ్డుప్రమాదంలో చనిపోవటంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది.

భారతీయ డెంటిస్ట్​ హత్య

By

Published : Mar 6, 2019, 8:45 PM IST

భారతీయ డెంటిస్ట్​ హత్య
ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్​ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురైంది. మంగళవారం రాత్రి ఆమె కారులోనే సూట్​కేసులో మృతదేహం లభ్యమైంది. తన మాజీ ప్రియుడు హర్ష్​ నర్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. మృతురాలి శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. సిడ్నీమార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో తన మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డేతో కలిసి వచ్చిన దృశ్యాలు సీసీ టీవీ దృశ్యాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతదేహం లభ్యమైన మరుసటి రోజే డాక్టర్ హర్ష్ నర్డే కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఈకేసులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్‌లో ప్రీతిరెడ్డి సర్జన్‌గా పనిచేస్తోంది. ఓ కాన్ఫరెన్స్​కు హాజరయ్యేందుకు సెయింట్ లియోనార్డ్స్​కు వచ్చింది. ఆదివారం బసచేసిన హోటల్‌ నుంచి అదృశ్యమైంది. ఆమె చివరిసారిగా మెక్‌ డోనాల్డ్‌కు వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైందని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియాలో హత్యకు గురైన ప్రీతిరెడ్డిది తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా గురుకుంట గ్రామం. తండ్రి నర్సింహారెడ్డి, తల్లి రేణుక. వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దకూతురు ప్రీతిరెడ్డి, చిన్న కుమార్తె ఇద్దరు వైద్యులే. నర్సింహారెడ్డి వైద్యుడు కావటంతో కుటుంబంతో సహా 1996లో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. చివరిసారిగా ప్రీతిరెడ్డి డిసెంబర్ 26న హైదరాబాద్​కు బంధువుల వివాహానికి వచ్చింది. ప్రీతి హత్య విషయం తెలియగానే సహోద్యోగులు షాక్​కి గురయ్యారు.

ప్రీతి మృతదేహం సూట్ కేసులో లభ్యమవడం, ఆమె మాజీ ప్రియుడు తరువాత రోజే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మిస్టరీగా మారింది.

ఇవీ చూడండి:ఆస్తి కోసం కత్తి దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details