ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఉద్యోగాలు ఇస్తామంటూ.. మోసాలకు పాల్పడ్డ ముఠా అరెస్టు - సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ముందుగా కొంత డబ్బు కడితే ఉద్యోగం ఖాయమన్నారు. నమ్మి పలువురు డబ్బులు కట్టారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఫోన్లు స్విచ్చాఫ్​ చేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో జరిగింది.

ఉద్యోగాలు ఇస్తామంటూ.. మోసాలకు పాల్పడ్డ ముఠా అరెస్టు
ఉద్యోగాలు ఇస్తామంటూ.. మోసాలకు పాల్పడ్డ ముఠా అరెస్టు

By

Published : Feb 20, 2020, 5:00 PM IST

మోసగాళ్ల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

ప్రముఖ సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సామాజిక మాధ్యమాల్లో మోసాలకు పాల్పడుతోన్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ముగ్గురు వ్యక్తుల నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.8 లక్షలు వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఆ ముగ్గురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులు, 4 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన నవీన్ అలియాస్ ప్రవీణ్, కృష్ణా జిల్లాకి చెందిన శివకుమార్ అలియాస్ రవి కిరణ్​లను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వీరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని మోసాలు బయటపడతాయని సీసీస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details