ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మాయమాటలు చెప్పాడు... ఖాతాలో సొమ్ము దోచేశాడు - bhimavaram bank fraud news in bhimavaram

అతను ఎస్​బీఐ కార్డు విభాగంలో ఉద్యోగి. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులను గమనించి వాళ్లని తన మోసపూరిత మాటలతో నమ్మించి... వాళ్ల ఖాతాలోని లక్షల రూపాయలు మాయం చేసిన వైనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.

భీమవరంలో క్రెడిట్​ కార్డు మోసం

By

Published : Nov 15, 2019, 3:29 PM IST

Updated : Nov 15, 2019, 6:16 PM IST

భీమవరంలో క్రెడిట్​ కార్డు మోసం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్​బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలో పని చేసే ఉద్యోగి ఖాతాదారులను మోసం చేశాడు. రాయలం గ్రామానికి చెందిన నక్క సువర్ణ రాజు బ్యాంక్​కు వచ్చే వాళ్లకు కార్డులు ఇప్పించేవాడు. తర్వాత వారికి మాయమాటలు చెప్పి… తెలివిగా పిన్‌ నంబర్‌ తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు. ఖాతాదారులు కూడా బ్యాంకు ఉద్యోగి అని ఓటీపీ చెప్పేవారు. కొద్ది రోజులుగా సువర్ణరాజు ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవటంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.

సువర్ణరాజు సుమారు రూ.40 లక్షల మేర మోసం చెేసినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఎస్​బీఐకి, క్రెడిట్ కార్డు విభాగానికి తేడా ఉందని అంటున్నారు. ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Last Updated : Nov 15, 2019, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details