హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా బస్సు నడిపి సోహిని సక్సేనా మృతికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ శ్రీధర్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆమె మృతి కుటుంబాన్ని ఛిన్న భిన్నం చేసింది.
- టాటా చెప్పి బయటకు వెళ్లిన అమ్మను ఎక్కడికి తీసుకెళ్లారు? ఇంటికి రాలేదే? ఎప్పుడొస్తుంది నాన్నా? - మూడేళ్ల వయసున్న ఆ కవల పిల్లలు వచ్చీరాని మాటల తూటాలివి... వీటికి జవాబిచ్చేదెవరు? కన్నుమూసిన తల్లి కోసం కలవరించే బిడ్డలకు ఎలా బదులివ్వాలి? ఏం చెప్పాలన్నా ఉబికి వచ్చే కన్నీటి భాష ఆ పసిహృదయాలకు ఎలా అర్థమయ్యేను?
- ‘ఒక్కగానొక్క చెల్లి.... పొద్దున్నే ఫోన్ చేసింది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది... కొన్ని గంటల్లోనే ఆమె లేదన్న వార్త విని ఎలా బతికున్నామో అర్థం కావట్లేదు’... ఇది ఆమె సోదరుడి మనో వేదన.
- ఈ మధ్యనే తండ్రిని కోల్పోయాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను నిత్యం ఓదార్చే నా భార్య ఏమైంది? ఒక్కసారిగా నా జీవితంలో ఏమిటీ శూన్యం? ఇద్దరు బిడ్డలు అమ్మను అడుగుతుంటే వారిని ఎలా సముదాయించగలను?’ - ఇది ఆమె భర్త హృదయాక్రోశం.
ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు
టీసీఎస్‌లో పనిచేస్తున్న సోహినీ మంగళవారం ఉదయం తన పిల్లలిద్దర్నీ సమీపంలోని ప్లేస్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. వారికి టాటా చెప్పి ద్విచక్ర వాహనంపై తాను పనిచేసే సంస్థకు బయలుదేరారు. గమ్యం చేరకముందే ఆర్టీసీ బస్సు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది.
అప్పుడు తండ్రి మరణం.. ఇప్పుడు భార్య