తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్‌లో పండగపూట విషాదం నిండింది. పస్తాపూర్‌కు చెందిన గోవర్దన్‌రెడ్డి, మాధవి దంపతుల రెండో కూతురు సహస్ర... గురువారం సాయంత్రం నీటి బకెట్ వద్ద ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు బకెట్లో తలకిందులుగా పడిపోయింది. నీటి శబ్దాన్ని గుర్తించిన తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటిన జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
బకెట్లో పడి పదినెలల చిన్నారి మృతి - జహీరాబాద్ వార్తలు
పండుగ కోసం కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఇంటిని సిద్ధం చేస్తున్నారు. అందరూ హడావుడిగా ఉన్న సమయంలో... బకెట్లోని నీళ్లతో అప్పటివరకూ ఆడుకుంటున్న చిన్నారి ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.
baby-girl-died-drow
పరిస్థితి విషమంగా మారడం వల్ల కర్ణాటక బీదర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దసరా పండుగకు ఇల్లు సిద్ధం చేస్తున్న సమయంలో ముద్దులొలికే చిన్నారి మృత్యువాత పడడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.