ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి - చాంద్రాయణగుట్టలో చిన్నారి మృతి

హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారిని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి
చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

By

Published : Oct 1, 2020, 5:59 PM IST

చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

లారీ ఢీ కొట్టి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన... హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గౌస్​నగర్​లోని మిల్లత్​నగర్​లో ఇంటి బయట మరియం అనే బాలిక ఆడుకుంటుండగా... టిప్పర్ లారీ ఢీ కొట్టింది. తీవ్రగాయాలైన మరియంను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతు చిన్నారి చనిపోయింది.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని... చిన్నారి బాబాయి తాహేర్ ఆరోపించారు. డ్రైవర్ వయస్సు తక్కువగా ఉండొచ్చని, లైసెన్స్ కూడా లేకపోవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details