గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడుకు చెందిన ముగ్గురు మిత్రులు కాట్రగడ్డ భాస్కరరావు, కాట్రగడ్డ హరిబాబు, గుంటుపల్లి భాస్కరరావు గ్రామ శివారులో మద్యం సేవిస్తున్నారు.
బీరు సీసాతో స్నేహితుడిపై దాడి - తాటికొండలో స్నేహితుల ఘర్షణ
ముగ్గురు స్నేహితులు గ్రామ శివారులో మద్యం తాగుతూ మాటా మాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఘటనలో బీరు సీసాతో మిత్రుడు గుంటుపల్లి భాస్కరరావుపై దాడి చేశారు. ఫలితంగా బాధితుడు తీవ్ర గాయాలతో పోలీస్ ఠాణాను ఆశ్రయించాడు.
మాటా మాటా పెరిగి బీరు సీసాతో స్నేహితుడిపై దాడి
తాగిన మైకంలో కాట్రగడ్డ భాస్కరరావు, హరిబాబు ఇద్దరు కలిసి గుంటుపల్లి భాస్కరరావుపై బీరు సీసాతో దాడి చేశారు. ఫలితంగా భాస్కరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.