ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా.!? - balapur police station hyderabad

హైదరాబాద్​ బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏఎస్సై నరసింహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నీళ్ల ట్యాంకు ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.

asi-narasimha-attempted-suicide-at-balapur-police-station-hyderabad

By

Published : Nov 22, 2019, 6:13 PM IST

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?

హైదరాబాద్ బాలాపూర్​ పోలీస్​స్టేషన్​ సమీపంలో ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నీళ్ల ట్యాంకు పైకి ఎక్కిన ఏఎస్సై నరసింహా... ఒంటిపై పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు నీళ్ల ట్యాంకు ఎక్కినప్పుడు కానిస్టేబుళ్లు వారించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. తోటి పోలీస్​ అతన్ని రక్షించి కిందికి దింపాడు. నరసింహా ఛాతిభాగానికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. 20 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో... అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...?

బాలాపూర్​ పీఎస్​లో నరసింహా ఏఎస్సైగా విధులు నిర్వహించేవాడు. ఇటీవల అతన్ని మంచాల్ పీఎస్​కు బదిలీ చేశారు. గురువారం అక్కడికి వెళ్లి రిపోర్టు చేశారు. అయితే బాలాపూర్​ సీఐ సైదులు... తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నివేదిక ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు బదిలీ చేశారని నరసింహా ఆరోపించారు. ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్​, వనస్థలిపురం ఏసీపీ జయరాంతోపాటు ఇతర ఉన్నతాధికారులు అపోలో ఆసుపత్రికి వచ్చి నరసింహా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో వరుసగా మూడో రోజూ బంద్

ABOUT THE AUTHOR

...view details