హైదరాబాద్ నగరంలో కొకైన్ సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్లను అబ్కారీ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. టోలీచౌకి వద్ద గ్రాము కొకైన్ 6 వేల రూపాయల చొప్పున విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్, కారు, బైక్, నాలుగు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ అంజిరెడ్డి తెలిపారు.
గతంలోనూ ఇమ్మాన్యుల్ది ఇదే తీరు..
ముగ్గురు నైజీరియన్లు శామ్యూల్, జేమ్స్, అబ్దుల్ ఖరీం.. ముంబయిలో ఇమ్మాన్యుల్ వద్ద కొకైన్ కొనుగోలు చేసి తెచ్చినట్లు విచారణలో తేలింది. ఇమ్మాన్యుల్ను గతంలోనే రెండు సార్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఒకసారి రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గోల్కొండ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి :
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కేసు