ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

రాష్ట్ర వ్యాప్తంగా.. ఎక్సైజ్​ దాడులు విస్తృతంగా.. - ap police caught illegal liquor botles latest news

మద్యం రేటు ఆకాశాన్ని అంటుతున్న కారణంగా.. కొనుగోలుదారులు, విక్రేతలు దొంగ దారులు వెతుకుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని అదుపు చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పడు అడ్డుకట్ట వేస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ ​పోస్ట్​లు, సారా స్థావరాలపై ఎక్సైజ్​ అధికారులు సోదాలు చేశారు.

police rides in some districts and caught bottles and cheap liquor near checkposts and some other places
రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం పట్టివేత

By

Published : May 28, 2020, 8:15 AM IST

శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం మండలం ఈనేసి పేట వద్ద 20 మందు బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్​ అధికారులు పట్టుకున్నారు. కవిటి మండలానికి చెందిన రాంబాబు ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ జనార్ధన రావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

విశాఖ జిల్లా

తీర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా సారా తయారీ చేస్తున్న స్థావరాలపై పాయకరావుపేట పోలీసులు దాడులు నిర్వహించారు. మండలంలో గజపతినగరం సముద్ర తీరంలో సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడం వల్ల ఎస్సై విభీషణరావు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సారా తయారీ చేసేందుకు ఉపయోగించే 350 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించిన పోలీసులు ధ్వంసం చేశారు. మిగతా సామగ్రిని తగలబెట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లా

ఇరగవరం మండలంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. రాపాక గ్రామ పొలాల్లో నాటు సారా తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. 145 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వీరవల్లి రాముని తణుకు ఎక్సైజ్ సీఐ రామ్మోహన్ రావు అరెస్టు చేశారు.

గుంటూరు జిల్లా

ద్విచక్రవాహనంపై 89 మద్యం సీసాలు తరిస్తున్న వ్యక్తి నారాకోడూరు చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడు. ఇతను చేబ్రోలు మండలం మంచాల గ్రామానికి చెందిన సాంబ శివరావు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అమర్తలూరు గ్రామానికి చెందిన రాజేష్​ అనే వ్యక్తి కారులో 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషోర్​ తెలిపారు.

కర్నూలు జిల్లా

ఆదోనిలో నాటు సారా అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామకృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణంలోని బోయ గెరి, వాల్మీకి నగర్ ప్రాంతాల్లో కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా సారా అమ్ముతున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు.

అనంతపురం జిల్లా

శెట్టూరు మండలం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటకకు చెందిన 292 మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని తనిఖీలు చేయగా... మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు శెట్టూరు ఎస్సై చెప్పారు. వీరి వద్ద నుంచి ప్యాకెట్లు, బైక్​ను​ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. కమ్మదూర్​ మండలంలో కూడా కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 40 మద్యం బాటిళ్లను, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

అక్రమంగా మద్యం తరలిస్తున్నహెడ్ కానిస్టేబుల్

ABOUT THE AUTHOR

...view details