తెలంగాణలో లోన్ యాప్ కేసులతో పలువురు బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనకు కారణమైన నిందితులను అరెస్ట్ చేయగా..తాజాగా బెంగళూరులోని అన్యూ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్‌గా పని చేస్తోన్న కీర్తిని అదుపులోకి తీసుకున్నారు.
గత నెల 25న బెంగళూరులో సైబర్ క్రైం పోలీసులు రుణ యాప్‌ల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కీర్తి.. పోలీసులకు చిక్కకుండా తప్పించకుంది. ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు.. తాజాగా ఆమెను బెంగళూరులోనే అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆపై రిమాండ్‌కు తరలించారు.
42 అప్లికేషన్ల ద్వారా..
లిఫాంగ్ టెక్నాలజీస్, పిన్ ప్రింట్ టెక్నాలజీస్, హాట్ ఫుల్ టెక్నాలజీస్, నాబ్లూమ్ టెక్నాలజీస్, అన్యూ ప్రైవేట్ లిమిటెడ్, తృతిగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 42 అప్లికేషన్లు నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. వీటి ద్వారా ఆన్లైన్లో సులభంగా రుణాలు ఇచ్చి.. రుణ గ్రహీతలను వేధింపులకు గురిచేస్తున్నట్లు గుర్తించారు. రాజేంద్రనగర్, జగిత్యాల, సిద్దిపేట పీఎస్‌ల పరిధిలో చనిపోయిన రుణ గ్రహీతలు.. ఈ కంపెనీల ద్వారా రుణాలు తీసుకున్నట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది.