ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చింతకొమ్మదిన్నె ఘటనలో.. మిగిలిన చిన్నారి మృతి - చింతకొమ్మదిన్నె ఘటనలో మరో చిన్నారి మృతి

కర్నూలు జిల్లా చింతకొమ్మదిన్నె గ్రామంలో బిస్కెట్లు తిని అస్వస్థతకు గురైన ఘటనలో మరో చిన్నారి మృతి చెందింది. ముగ్గురిలో ఒకరు ఆదివారం, మరొకరు సోమవారం మృతి చెందగా... నేడు మిగిలిన చిన్నారి ప్రాణం విడిచింది.

Another child died after eating biscuits and falling ill in Chintakommadinne village in Kurnool district.
చింతకొమ్మదిన్నె ఘటనలో మరో చిన్నారి మృతి

By

Published : Sep 16, 2020, 12:18 PM IST

Updated : Sep 16, 2020, 4:04 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో విషపూరిత బిస్కెట్లు తిని అస్వస్థతకు గురైన ఘటనలో మూడో చిన్నారి మృతి చెందింది. ఆదివారం రోజు ముగ్గురు పిల్లలు... స్థానిక అంగడిలో బిస్కెట్లు కొనుగోలు చేసి తిన్నారు. కాసేపటికి ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వారిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతూ 8 సంవత్సరాల ఉసేన్ బాషా మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 4 సంవత్సరాల ఉసేన్ బీ సోమవారం చనిపోయింది. మరో చిన్నారి జమాల్ బీ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై ఆళ్లగడ్డ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Last Updated : Sep 16, 2020, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details