అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం తమ్మిడేపల్లి గ్రామ పోలీస్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... కర్ణాటకకు చెందిన రమేష్ అనే వక్కల వ్యాపారి వద్ద 47 లక్షల 50 వేల రూపాయల డబ్బు పట్టుబడింది. అతనిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి విచారించగా అమరాపురం మండల రైతుల నుంచి వక్కలు తీసుకెళ్ళాను. దీనికి సంబంధించి ఆ రైతులకు డబ్బు ఇవ్వాల్సి ఉండగా...నగదుతో వచ్చానని వ్యాపారి తెలిపాడు.
భారీగా నగదు పట్టుకున్నారు....తిరిగి ఇచ్చేశారు! - మడకశిర వార్తలు
తనిఖీల్లో భాగంగా ఓ వ్యాపారి వద్ధ నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అనంతపురం జిల్లా పోలీసులు. తర్వాత అతని డబ్బును తిరిగి ఇచ్చేశారు... పూర్తి వివరాల్లోకి వెళితే...
![భారీగా నగదు పట్టుకున్నారు....తిరిగి ఇచ్చేశారు! Anantapur district police seized a large amount of cash from a trader](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8928198-878-8928198-1600995972955.jpg)
అనంతలో భారీగ నగదు పట్టివేత
అతను తెలిపిన విధంగా సంబంధిత వక్క రైతులను పిలిపించి విచారించగా... ఆ వ్యాపారి తమకు ఇచ్చేందుకే డబ్బు తెచ్చాడని రైతులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా...వారి ఆదేశాల ప్రకారం మొత్తం డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆటోల ద్వారా దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు