ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు? - దిశ ఘటన

ఘోరం! అన్యాయం! రాక్షసం! ఉన్మాదం! ఉరి తీయండి..! లేదంటే మాకు అప్పగించండి..! అత్యాచారం జరిగిన ప్రతిసారీ... దేశంలో ఇవే మాటలు వినిపిస్తాయి. ఇప్పుడు దిశపై హత్యాచారం విషయంలోనూ ఇదే ఆగ్రహం వెల్లువెత్తుతోంది. కానీ... ఇలా ఎన్నాళ్లు రహదారులపై ఆ ప్లకార్డులు పట్టుకుని గొంతెండిపోయేలా అరవాలి..? ఎన్నాళ్లు... న్యాయం కోసం పోరాటం చేయాలి..? ఈ ప్రశ్నలతో పాటే... అసలు... ఈ పరిస్థితులకు కారణాలేమిటన్న సందేహమూ అందరి మెదళ్లు తొలిచేస్తోంది.

idisangathi item
idisangathi item

By

Published : Dec 3, 2019, 12:42 PM IST

Updated : Dec 3, 2019, 1:49 PM IST

" నేను నీకు హామీ ఇస్తున్నా. నా గుండె, ఆత్మ, శరీరం సాక్షిగా.. ప్రపంచంలోని దుష్టశక్తులు, హీనుల బారిన పడకుండా నిన్ను రక్షించుకుంటా. నీ భద్రత కోసం అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తా". నిర్భయ తర్వాత... దేశవ్యాప్తంగా సంచలనమైంది కథువాలో బాలిక అత్యాచార ఘటన. ఆ సమయంలో... నటి సన్నీ లియోని ట్విట్టర్‌లో ఇలా భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. పోస్ట్ చేసింది ఆమే అయినా... మొత్తం దేశంలోని తల్లులందరి మనసులోని భావాన్ని ప్రతిబింబించింది ఈ ఫొటో.

ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చేదెవరు?

టైమ్​ మ్యాగజైన్​ కథనం:

2012 నాటి నిర్భయ ఘటన. బస్సులో యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపటం అందరిలోనూ ఆగ్రహం, ఆందోళన కలిగించింది. తర్వాత ముంబయిలో 23 ఏళ్ల యువతిపై అత్యాచారమూ అదే స్థాయిలో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనల నేపథ్యంలోనే... టైమ్ మ్యాగజైన్‌ భారత్‌ గురించి వ్యాఖ్యానిస్తూ... కథనం రాసింది. భారతదేశ సమాజంలోని పురుషాధిక్యతకు ఇవి అద్దం పడుతున్నాయని అందులో పేర్కొంది. ఏ దేశంలో అయితే స్త్రీని గౌరవిస్తారన్న భావన ఉందో... అదే దేశం అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకునేలా చేసింది. అమ్మాయిలకు రక్షణ ఎక్కడ అంటే... అమ్మ కడుపులోనే అని చెప్పుకోవాల్సిన దుస్థితి.

నివ్వెరపోయే నిజాలు..

ఇకపై ఏ అమ్మాయి గుడికి వెళ్లినా, బడికి వెళ్లినా వెంట ఓ పోలీసును పంపాల్సి వస్తుందేమో ..! ఇదేమీ అతిశయోక్తి కాదు. వాస్తవం. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అసలు వారికి... రక్షణ ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండదో తెలియడం లేదు. ఏ తండ్రైతే తన గుండెలపై అడుగులు వేయిస్తూ ఆడించాడో... అదే నాన్న... ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడితే ఆ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుంది..? ఏ అన్నైతే తనతో పాటు అమ్మ చేతితో గోరు ముద్దలు తిన్నాడో... అదే అన్న పశువుగా ప్రవర్తిస్తే..? ఆ చిన్నారి ఎవరికి చెప్పుకుంటుంది..? ఇవేవీ ఊహాజనితం కావు. నివ్వెరపోయేలా చేసిన నిజమైన ఘటనలు.

అంత క్రూరత్వం ఎలా..?

అసలెందుకీ దౌర్భాగ్య స్థితి..? అందరినీ కలవరపెడుతున్న అంశమిదే. దిశ హత్యాచార ఘటనలో నిందితులందరూ 25 ఏళ్ల లోపువారే కావటం విస్మయపరిచింది. ఆ వయసులో అంత క్రూరత్వం ఎలా వచ్చిందన్నదే అంతు తేలని ప్రశ్న. ఆ సమయంలో నిందితులంతా మద్యం మత్తులో ఉన్నారని తేలింది. మద్యపానం, ధూమపానం మనిషిని శారీరకంగా కుంగదీస్తే... స్మార్ట్‌ఫోన్లు మానసిక వైకల్యానికి కారణమవుతున్నాయి. స్త్రీల శరీరాలను... కేవలం లైంగిక వాంఛలు తీర్చే పరికరాలుగానే చూస్తున్నారు కొందరు మృగాళ్లు. అందుకే... సమాజంలో ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయి.

ఎంతకాలం భయపడాలి..

మొన్న నిర్భయ, తరవాత కథువా, ఇవాళ దిశ..! ప్రాంతాలు మారుతున్నాయంతే. ఆ క్రూరత్వంలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని అమ్మాయిల తల్లిదండ్రులు ఎంత కాలం భయపడాలి..? ఈ సమస్యకు ఆది తప్ప...అంతు కనబడటం లేదు. చట్టాలు, చర్యలు ఏవీ... కిరాతకుల్లో కొంచెం కూడా మార్పు తీసుకురాడం లేదు. ఈ క్రమంలోనే... ఈ ఘోరకలి అంతమయ్యేదెప్పుడని ప్రతి కన్నపేగు ఈ సమాజాన్ని ప్రశ్నిస్తోంది. సమాధానం చెప్పే వారే కరవయ్యారు.

ఇవీ చూడండి:

భారీగా డౌన్​లోడైన 'హాక్‌–ఐ'

Last Updated : Dec 3, 2019, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details