ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కాసేపటి కిక్కు కోసం కన్నతల్లినే హత్య చేశాడు.! - తెలంగాణ నేర వార్తలు

నవ మాసాలు మోసిన కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు కదా అని అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేది ఆ తల్లి. అలా డబ్బులు ఇవ్వడమే ఆమె పాలిట యమపాశంగా మారింది. అదే అదనుగా తీసుకున్న కొడుకు మద్యానికి బానిసయ్యాడు. కన్నతల్లినే గొంతు నులిమి చంపాడు ఆ కర్కశ కుమారుడు.

alcoholic-addict
alcoholic-addict

By

Published : Dec 16, 2020, 7:08 PM IST

కన్న కొడుకే ఆ తల్లి పట్ల కాలయముడయ్యాడు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని తల్లి గొంతు నులిమి చంపాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు సాయిలు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించి తల్లి సాయవ్వను గొంతు నులిమి చంపాడు.

మద్యం కోసం సాయిలు తరుచుగా అతని తల్లి సాయవ్వను డబ్బులు అడిగేవాడని స్థానికులు తెలిపారు. తల్లీకొడుకుల మధ్య గొడవ కావడంతో ఆమె డబ్బులు ఇవ్వకపోవడం వల్ల గొంతు నులిమి హత్య చేశాడని వెల్లడించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details