తెలంగాణ హైకోర్టులో 'అగ్రిగోల్డ్'.. ఏప్రిల్ 8కి వాయిదా - అగ్రిగోల్డ్ కేసు
అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట భారీగా బినామీ ఆస్తులున్నాయన్న డిపాజిటర్ల ఆరోపణలపై తెలంగాణ హై కోర్టులో వాదనలు జరిగాయి. ఆరోపణలపై స్పందించాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట భారీగా బినామీ ఆస్తులున్నాయన్న డిపాజిటర్ల ఆరోపణలపై తెలంగాణ హై కోర్టులో వాదనలు జరిగాయి. ఆరోపణలపై స్పందించాలంటూ ఆంధ్రప్రదేశ్సీఐడీనిన్యాయస్థానం ఆదేశించింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్ ప్రసాద్ పేరిటే సుమారు 700 కోట్ల రూపాయల బినామీ అస్తులున్నాయని.. వాటన్నింటిపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన అఫిడవిట్‌ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలో స్పందన తెలపాలని ఏపీ సీఐడీతో పాటు.. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్నిఆదేశించింది.తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. కనీస ధర తగ్గించినప్పటికీ హాయ్ ల్యాండ్ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదని ఎస్బీఐ హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.