ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: ఏసీపీ నర్సింహారెడ్డికి 14 రోజుల రిమాండ్ - acp narsimha reddy case update

ఏసీపీ నర్సింహారెడ్డికి అనిశా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. అనంతరం అతన్ని చంచల్​గూడ జైలుకు తరలించారు. నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో ఏసీపీ నర్సింహారెడ్డిని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

తెలంగాణ: ఏసీపీ నర్సింహారెడ్డికి 14 రోజుల రిమాండ్
తెలంగాణ: ఏసీపీ నర్సింహారెడ్డికి 14 రోజుల రిమాండ్

By

Published : Oct 8, 2020, 9:30 PM IST

ఏసీపీ నర్సింహారెడ్డి.. బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా గుర్తించింది. అధికారుల ప్రశ్నలకు.. నర్సింహారెడ్డి సమాధానం ఇవ్వకున్నా.. బినామీ ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలను ఆయన ముందుంచి వివరాలు రాబట్టారు.

బినామీ పేర్లమీద నర్సింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు. మాదాపూర్​లోని ఓ మహిళ పేరుతో కొనుగోలు చేసిన ఆస్తుల గురించి ఆరా తీశారు. సదరు మహిళ విదేశాలకు వెళ్లడంతో ఆమె తిరిగి వచ్చాక నర్సింహారెడ్డి బినామీ ఆస్తుల వివరాలు మరిన్ని బయటపడనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details