సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంలో నిందితుల కోసం సీఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపారు. దిల్లీకి వెళ్లిన బృందం ఝార్ఖండ్లో కేసుతో సంబంధం ఉన్న నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. నిందితుడ్ని పోలీసులు తీసుకువస్తున్న క్రమంలో నిందితుడు అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంలో నిందితుడు అదృశ్యం!
ఏపీసీఎం సహాయనిధి నుంచి నకిలీ చెక్కులతో రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన ముఠా మూలాలు ఏపీ సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో విస్తరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల కోసం సీఐడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దిల్లీకి వెళ్లిన బృందం ఝార్ఖండ్ కేసుతో సంబంధం ఉన్న నిందితుడిని గుర్తించినట్లు సమాచారం.
Accused Missing
TAGGED:
apcmrf latest news