తెలంగాణ: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన తహసీల్దార్
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో భారీ అవినీతి తిమింగలం అనిశా వలకు చిక్కింది. ఏకంగా రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి అధికారులకు చిక్కారు.
ఏఎస్రావునగర్లోని తహసీల్దార్ నివాసంలో అనిశా అధికారులు పట్టుకున్నారు. రాంపల్లిలోని 28 ఎకరాల భూ సెటిల్మెంట్‌కు సంబంధించి లంచం తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. తహసీల్దార్ ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. షేక్పేట్ భూ వివాదం జరిగి నెలరోజులు కాకముందే భారీ మొత్తంలో కీసర తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ నాగరాజు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్, కన్నడ అంజిరెడ్డిలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.