ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ అనుమతి కోసం పంచాయితీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో కోటేశ్వరరావు అనే వ్యక్తి 110 గజాల స్థలంలో చిన్న ఇల్లు నిర్మించుకోడానికి సిద్ధమయ్యారు.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం చలానా కూడా కట్టారు. అయితే అనుమతి ఇవ్వడానికి కార్యదర్శి మహబూబ్ భాష 35వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పైసలివ్వలేని కోటేశ్వరరావు... ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దొనకొండ పంచాయితీ కార్యాలయంలో మాటు వేసిన అధికారులు... కోటేశ్వరరావు దగ్గర డబ్బులు తీసుకుంటుండగా బాషను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
35 వేలు డిమాండ్ చేశాడు..ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు - ఏపీ ఏసీబీ తాజా వార్తలు
ఇంటి అనుమతి కోసం ఆ పంచాయితీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేశాడు. ఏకంగా 35వేలకు టెండర్ వేశాడు. డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తానని తేల్చి చెప్పాడు. దిక్కుతోచని స్థితిలో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మాటు వేసిన అధికారులు... లంచం తీసుకుంటున్న పంచాయితీ కార్యదర్శిని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.
panchayat secretary
Last Updated : Nov 19, 2020, 10:28 PM IST