ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

లాటరీ పేరుతో రూ.46లక్షల టోకరా - ప్రకాశం జిల్లా వార్తలు

మీకు పదికోట్లు రూపాయలు లాటరీ తగిలింది... ఈ డబ్బు మీకు పార్శల్‌ ద్వారా పంపిస్తున్నాం... కస్టమ్స్‌ పన్నులు వంటివి చెల్లించేందుకు ఇందులో 40 శాతం డబ్బులు చెల్లించండి అంటూ ఫోన్‌లో వచ్చిన సమాచారాన్ని నమ్మి..ఏకంగా 46లక్షల రూపాయలు చెల్లించి మోసపోయాడు ప్రకాశం జిల్లా యువకుడు.

A young man who is deceived by the lottery name in prakasham district
లాటరీ పేరుతో మోసం

By

Published : May 1, 2020, 11:57 AM IST

ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం పీరాపురానికి చెందిన ఓ యువకుడిని ఆన్‌లైన్ మోసగాళ్లు నిండా ముంచేశారు. 10 కోట్ల రూపాయల లాటరీ తగిలందంటూ నమ్మబలికిన కేటుగాళ్లు....కస్టమ్స్‌ పన్ను కట్టాలంటూ దశలవారీగా ఏకంగా 46 లక్షలు కాజేశారు. పీరాపురానికి చెందిన నాగబ్రహ్మయ్యకు కొద్ది రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. 10 కోట్ల లాటరీ తగిలిందని చెప్పిన మోసగాళ్లు....కొంత సొమ్ము చెల్లించాలని కోరారు. అక్క వద్ద ఉన్న 12 లక్షలు, తల్లిదండ్రులు పొలం కొనేందుకు దాచిన 15 లక్షలకు తోడు...బంధువుల వద్ద అప్పుచేసి దుండగుు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌లో 46 లక్షలు జమ చేశాడు. పెద్దమొత్తంలో డబ్బులు ఆన్‌లైన్‌లో పంపిస్తుండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు విచారించగా...నాగబ్రహ్మయ్య మోసపోయినట్లు తేలింది. నైజీరియా మోసగాళ్లు లాటరీ పేరిట బురిడి కొట్టించారని పోలీసుల భావిస్తున్నారు.

లాటరీ పేరుతో మోసం

ABOUT THE AUTHOR

...view details