ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

యువకుడు ఆత్మహత్య...అనుమానాస్పద మృతిగా కేసు నమోదు - viskaha news

విశాఖ మద్దిలపాలెంలో ఓ యువకుడు ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

A young man suspected death  in Visakhapatnam
విశాఖలో యువకుడు ఆత్మహత్య

By

Published : Oct 7, 2020, 11:42 AM IST

విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్దిలపాలెం సాయి లాడ్జిలో ఫ్యాన్​కు ఉరివేసుకుని చనిపోయాడు. చాలా సేపటినుంచి తలుపులు తెరవకపోవటంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన ఎంవీపీ పోలీసులు మృతుడు పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని గుబ్బలవారి వీధికి చెందిన మధుగా గుర్తించారు.

ఈనెల 4న రూం నెంబర్ 501లో అద్దెకు దిగినట్లు లాడ్జి నిర్వహకులు తెలిపారు. గదిలో మద్యం సీసాలను గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి:ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం

ABOUT THE AUTHOR

...view details