కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు వికటించి... ఓ గర్భిణీ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పెద ఓగిరాలకు చెందిన కనగాల ఆదిలక్ష్మిని ఆమె బంధువులు కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే నొప్పులు వచ్చే సమయానికి గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల ఆస్పత్రి సిబ్బందే కాన్పు చేశారు. ఓ శిశువుని ప్రసవించిన అనంతరం బాధితురాలి పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదిలక్ష్మి మృతి చెందింది. దీనిపై బాధితురాలి బంధువులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలు అందుబాటులో లేకుండా సిబ్బంది కాన్పు ఎలా చేస్తారని నిలదీశారు. మృతురాలికి మూడేళ్ల కుమార్తె, భర్త ఉన్నారు. ఘటనపై ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.
కాన్పు వికటించి గర్భిణీ మృతి.. బంధువుల ఆందోళన
కాన్పు వికటించి ఓ గర్భిణీ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. అయితే వైద్యురాలు అందుబాటులో లేకుండా.. ఆస్పత్రి సిబ్బందే కాన్పు చేశారని అందువల్లే గర్భిణీ చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాన్పు వికటించి మహిళ మృతి