ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అనంతపురంలో దారుణం.. గుర్తు తెలియని వ్యక్తి హత్య - అనంతపురం జిల్లా క్రైం న్యూస్​

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలోని చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. క్లూస్​ టీం, సీసీ పుటేజ్ ద్వారా నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

a unknown man was killed on a pond at Bukkarayasamudram anantapur district
అనంతపురంలో దారణం.. గుర్తుతెలియని వ్యక్తి హత్య

By

Published : Oct 18, 2020, 10:33 AM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలోని చెరువు కట్టపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్నిపోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో మృతున్ని గుర్తుతెలియని మరో వ్యక్తి బండరాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మంచాలకు రిపేర్లు చేస్తూ జీవించేవాడని భావిస్తున్నారు. మృతుని టీవీఎస్ ఎక్సెల్ మోటార్ వాహనాన్ని నిందితుడు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుక్కరాయసముద్రం సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. క్లూస్​ టీం, సీసీ పుటేజ్​లను పరిశీలిస్తున్నామని త్వరలో నిందితున్ని పట్టుకుంటామన్నారు.

ఈ చెరువు సమీపంలో గతంలోనూ ఇలాంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details