ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడు ఆత్మహత్య - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కుమారుడు డబ్బులు అడిగాడు. తండ్రి నిరాకరించాడు. మనస్థాపానికి గురైన కుమారుడు.. ఆవేశంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కొడాలి గ్రామంలో జరిగింది.

a student dies with hanging at Kodaly
డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య !

By

Published : Nov 1, 2020, 4:44 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన పురుగుపాటి వరప్రసాద్ రెడ్డి కుమారుడు సాయి వెంకట కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థి. అతను ఖర్చుల నిమిత్తం శనివారం రాత్రి 2 వేల రూపాయలు అడగ్గా.. తండ్రి ఇవ్వలేదు.

మనస్థాపం చెందిన వెంకట కృష్ణారెడ్డి.. క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఘంటసాల ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details