ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రాణం తీసిన ఆన్​లైన్​ తరగతులు... ఫోన్​ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఆన్​లైన్​ తరగతుల కోసం తల్లిదండ్రులు సెల్​ఫోన్​ కొనివ్వలేదని రఘుప్రసాద్​ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

సెల్​ఫోన్​ కొనివ్వలేదని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
సెల్​ఫోన్​ కొనివ్వలేదని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

By

Published : Oct 26, 2020, 3:39 PM IST

Updated : Nov 23, 2020, 12:47 PM IST

ఆన్‌లైన్‌ తరగతుల కోసం సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కొడిమ్యాల మండలం తిర్మాలపూర్‌ గ్రామానికి చెందిన రఘుప్రసాద్‌ అనే బాలుడు ఆన్​లైన్​ తరగతుల కోసం చరవాణి కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. దసరా పండుగకి కొనిస్తామని వారు చెప్పడంతో ఇంట్లో ఉన్న వేరే సెల్​ఫోన్​తో తరగతులు వెళ్లదీశాడు.

పండుగ వచ్చింది.. ఫోన్​ కొనివ్వాలని తల్లిదండ్రులను రఘు అడగడంతో పత్తి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతో కొంటామని చెప్పారు. మనస్తాపం చెందిన రఘు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం

Last Updated : Nov 23, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details