ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మాజీమంత్రి జవహర్ కుమారుడికి తప్పిన ప్రమాదం

బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని హత్య చేసే ప్రయత్నంలో భాగంగా నిందితులు... కృష్ణా జిల్లా తిరువూరు జాతీయ రహదారిపై వస్తున్న మాజీమంత్రి జవహర్ కుమారుడి కారును ఢీకొట్టారు. అయితే అతనికి ఎటువంటి గాయాలు కాలేదు.

jawahar son
మాజీ మంత్రి జవహర్ కుమారుడికి తప్పిన ప్రమాదం

By

Published : Jun 3, 2020, 5:48 PM IST

కృష్ణా జిల్లా తిరువూరు జాతీయ రహదారిపై వెళుతున్న మాజీమంత్రి జవహర్ కుమారుడికి తృటిలో ప్రమాదం తప్పింది. కాకర్ల సమీపంలో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని చంపే ప్రయత్నం చేసిన నిందితులు... అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన కారుని గుద్దేశారు. తన కుమార్తెను వేధిస్తున్న వ్యక్తిపై ఆగ్రహంతోనే... లారీ యజమాని హత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details