ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండల పెర్నమెట్ట సమీపంలో వివాహితపై హత్యాయత్నం జరిగింది. సమీప బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం బోగిశెట్టి శివమ్మ తన వదిన అల్లుడు రమణయ్యతో ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహనం పెర్నమెట్ట ఊరు చివర వద్దకు రాగానే సమీప చెరువు వైపు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తినట్లు సమాచారం. ఫలితంగా ఆగ్రహించిన రమణయ్య తన వెంట తెచ్చుకున్న కత్తితో శివమ్మపై దాడికి యత్నించగా శివమ్మ భయపడి రోడ్డు మీదకు పరుగు లంకించుకుంది.
రహదారి చేరినప్పటికీ..
కష్టం మీద రహదారికి చేరుకున్నప్పటికీ వెనకాలే వెంబండించిన రమణయ్య బాధితురాలి మెడపై కత్తితో దాడి చేశాడు. ఫలితంగా తీవ్ర రక్త స్రావంతో శివమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు.