ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - పశ్చిమ గోదావరి క్రైం వార్తలు

కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తూర్ల లక్ష్మీపురం గ్రామంలో జరిగింది.

a man died due to drink insecticides at turla-lashmipuram in wast godavari
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య !

By

Published : Oct 11, 2020, 7:05 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన గంట సత్యనారాయణ... కొంతకాలంగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి భరించలేక శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు.

గుర్తించిన కుటుంబ సభ్యులు.. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి సత్యనారాయణ.. ఇవాళ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details