కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కవలకుంట్లకు చెందిన ఓబయ్య.. స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళ్తున్నారు. బి. కోడూరు మండలం ఆనంవారిపల్లికి చెందిన నాగార్జున బైకుపై వస్తున్నాడు. అయితే ఐత్రంపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న వాళ్ల రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓబయ్య అక్కడే మృతి చెందగా.. నాగార్జున కాలు విరిగింది. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - kadapa latest crime news
కడప జిల్లా బి.కోడూరు మండలం ఐత్రంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఘటన సంభవించింది.
![రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు a man died and another person injured in a bike accident at Aitrampet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9302162-thumbnail-3x2-accident.jpg)
రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు