తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని లక్కవత్తుల రాజు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కొడుకు.. చేతులు కట్టేసి శనివారం కర్రతో చితకబాదాడు. ఈ దృశ్యాలను కొందరు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.
మతిస్థిమితం లేని యువకుడిపై దాడి - నిర్మల్‌లో మతిస్తిమితం లేని యువకుడిపై దాడి వార్తలు
మతిస్థిమితం లేని యువకుడిని గ్రామ పంచాయతీ ముందు చేతులు కట్టేసి కొట్టిన ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్నవారు ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.

మతిస్తిమితం లేని యువకుడిపై దాడి
మతిస్తిమితం లేని యువకుడిపై దాడి
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన ఆకుల శ్రీనివాస్, ఎనగంటి శేఖర్, నర్సవ్వపై కేసు నమోదు చేశారు. మహిళను దూషించాడన్న ఆరోపణపై దెబ్బలుతిన్న వ్యక్తి రాజుపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్టు