ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మహిళ మృతి.. భయంతో యువకుడి బలవన్మరణం - లిఫ్ట్ ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న యువకుడు న్యూస్

ఓ మహిళకు ఓ యువకుడు లిఫ్ట్ ఇచ్చాడు. అనుకోకుండా ప్రమాదం జరిగి మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో యువకుడు భయానికి గురై.. ఆత్మహత్య చేసుకున్నాడు.

మహిళ మృతి.. భయంతో యువకుడి బలవన్మరణం
మహిళ మృతి.. భయంతో యువకుడి బలవన్మరణం

By

Published : Jul 19, 2020, 9:18 PM IST

మహిళ మృతి.. భయంతో యువకుడి బలవన్మరణం

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలం గుండ్యే నాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. మోపాల్ వెళ్తున్న యువకుడిని... ఓ మహిళ లిఫ్ట్‌ అడిగి ద్విచక్ర వాహనం ఎక్కారు. ఈ క్రమంలో అమ్రాబాద్‌ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటనలో 52ఏళ్ల లక్ష్మీబాయి ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతితో భయపడిన 24 ఏళ్ల నివర్తి అనే యువకుడు... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క ప్రమాదం వల్ల ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో...విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి :రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు

ABOUT THE AUTHOR

...view details