కువైట్‌లో ఉన్న తన భార్యను స్వస్థలానికి రావాలని కోరుతున్న ఆమె భర్త ఉరేసుకుంటున్నట్లు బెదిరించబోయి చివరకు ప్రాణాలను పోగొట్టుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి ఎస్సై సతీష్ కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన జి.గణేష్ (35) భార్య బతుకుదెరువు కోసం అయిదు నెలల కిందట కువైట్ వెళ్లింది. ఆమెను ఇంటికి వచ్చేయమని కోరుతున్న భర్త.. ఆదివారం రాత్రి ఉరేసుకుంటున్నట్లు బెదిరిద్దామని ఫ్యాన్‌కు తాడు బిగించాడు. అది ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకుపోవడంతో గణేష్ మృతి చెందాడు. ఈ ఉదంతం అంతా సెల్ఫీ వీడియోలో నిక్షిప్తం అయింది. బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
భార్యను బెదిరిస్తూ సెల్ఫీ వీడియో...చివరకు - A husband who lost his life to threaten his wife
పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్లపూడిలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించబోయి ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి.
![భార్యను బెదిరిస్తూ సెల్ఫీ వీడియో...చివరకు A husband who lost his life to threaten his wife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7066076-703-7066076-1588668715619.jpg)
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం