హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు అతడి 6 బ్యాంకుల నుంచి 6 లక్షల రూపాయల మొత్తాన్ని రుణం రూపంలో కొట్టేశారు. సిబిల్ స్కోర్ నేపథ్యంలో ఈ విషయం వెలుగులో వచ్చింది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్.. ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల ఆయన తన సిబిల్ రిపోర్ట్ చూసుకున్నారు. అందులో స్కోర్ చాలా తక్కువగా ఉండటంపై ఆరా తీశాడు.
'ఆయనకు తెలియకుండానే రూ.6 లక్షలు లోన్ ఎలా తీశారు?' - హైదరాబాద్ సైబర్ క్రైం కేసులు
ఓ వ్యక్తి సిబిల్ రిపోర్ట్ చూసుకున్నాడు. అందులో స్కోర్ చాలా తక్కువ ఉంది. ఏంటా అని ఆరా తీశాడు. అతని పేరుతో 6 బ్యాంకుల్లో లక్ష చొప్పున మొత్తం రూ.6 లక్షలు రుణం తీసుకున్నట్లు ఉంది. ఆ మొత్తాలు చెల్లించకపోవడంతో డిఫాల్ట్ అయినట్లు తెలుసుకున్నాడు. ఆ సమాచారంతో షాక్ అయిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అతని ప్రమేయం లేకుండా లోన్ ఎలా వచ్చింది? ఎవరు తీసుకున్నారు?

సునీల్ 6 బ్యాంకుల్లో లక్ష చొప్పున రుణం తీసుకున్నట్లు... ఆ మొత్తాలు చెల్లించని కారణంగా డిఫాల్డ్ అయినట్లు తెలుసుకున్నాడు. అయితే.. ఈ రుణాల విషయం తనకు తెలియదంటూ సునీల్ వాపోయాడు. బాధితుడి పాన్‌కార్డ్‌తో సైబర్ నేరగాళ్లు... ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్ లోన్ సదుపాయంతో ఈ రుణాలు పొందారని వెల్లడైంది.
బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది... రుణం ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది... తదితర అంశాలు పోలీసులు ఆరా తీయనున్నారు.